Showing posts with label telugu parody. Show all posts
Showing posts with label telugu parody. Show all posts

Thursday, July 15, 2010

ఫేక్ నిపుణుడు

">
మిస్టర్. పీ ఎం

హహ్హహ్హహ్హ

ఏమంటివి ఏమంటివి 

ఫేక్ నెపమున బిత్తర చూపుల బాచీగాడిందు నిలువ అర్హతలేదందువా? 

వాట్ ద ఫ*?

ఎంత మాట ఎంత మాట?

ఇది స్కిల్ టెస్ట్ యే గాని ఫేక్ టెస్ట్ కాదే?

కాదు.. కాకూడదూ.. ఇది కన్సల్టెన్సీ టెస్టే అందువా? 

నీ అల్లుడు అఙ్ఞ్యాని గాడి ఆఫర్ ఎట్టిది?

అతి దుమారంలేపిన నీ ఎంట్రీ ఎట్టిది?

దొడ్డిదారిలో వచ్చితివి కదయ్య? నీది ఏంత ఎక్స్పీరిఎన్సు?

ఇంత యేల... మన టీం మొదటి మెంబరు, జుత్తు నెరిసిన ఈ పసిగుడ్డు, అమీర్పేట్ సందులో కన్సల్టెన్సీ కోసం తిరగలేదా..?


వీడికెంత ఎక్స్పీరిఎన్సు?

హహ్హహ్హహ్హ

నాతో చెప్పింతువేమయ్య...? 

ఆహ్! సక్స్..!!  

మన కంపెనీ స్తాపించిన నక్కతోక నర్తన్ గాడు, శ్రీనగర్ బంకులో ఎక్స్పీరిఎన్సు క్లేం చేయలేదా?  

ఆతడు పంజగుట్ట పాన్ కొట్టు యందు డాటా ఎంట్రీ ఎక్స్పీరిఎన్స్ అని, ఆ ఎక్స్పీరిఎన్స్, కూకట్ పల్లి కిరాణా కొట్టుయందు ప్రోగ్రామ్మర్ అని, ఆ ప్రోగ్రామ్మర్ చిక్కడపల్లి చీరల షాపు యందు, టీం లీడ్ అని, ఆ టీం లీడ్ యదవైన మా రిలేషన్ మానేజర్తో మంతనాలని, పీనాసి పీనుగైన పునీత్ తో, ఇన్వెస్టర్ అని, మా టీం హెచ్చార్  తో, బ్రహ్మచారినని, సన్నాసినని పెళ్ళాడి ఈ సంస్థ స్తాపించలేదా?

రిక్వైర్మెంట్స్ ని బట్టి సొల్లు రిక్రూట్మెంట్లతో పాపులరైన ఈ కంపెని ఏనాడో ఫేక్ లిస్ట్ లో టాపరైనది?

కాగ నేడు ఫేకు ఫేకు అను చెత్త పరేషానెందులకు?